మా గురించి

తెలుపు.కామ్ ను 1998 జనవరి లో మీనా, నేను San Jose లో ఉండగా ప్రారంభించాం. ఆ పేరు "తెలు"గు "పు"స్తకాలు అన్నదానికి క్లుప్తంగా పెట్టినది. అప్పట్లో సరదాగా నడుస్తున్న "తెలు"గు "సా"హిత్యం గుంపు "తెలుసా" లాగా.

2000 జనవరిలో మెల్లగా పుస్తకాలు తెప్పించే ఏర్పాటు చేసాం. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి. విదేశాల లోని తెలుగు పుస్తక అభిమానులు "ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కుందాం" అనుకుంటూ వాయిదా వేసుకుంటూ ఉండడం చూసి. జర్మనీ లో ఉన్న మిత్రులు పరుచూరి శ్రీనివాస్ సహాయంతో నవోదయ రామ మోహన రావు గారి పరిచయం కలిగింది. వారి సహకారంతో ఇప్పటిదాకా కొంత మంది (అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ దేశాలలోని ) తెలుగు పుస్తక అభిమానులకు పుస్తకాలు తెప్పించగలగడం ఈ website సాధించగలిగిన విషయం. మొదట్లో మా ఇంట్లో ఉన్న పుస్తకాలను site లో పెట్టాము. చాలా వరకు పుస్తకాల అట్ట మీద బొమ్మల్ని scan చేసి మీనా సహాయపడింది నాకు.

2001 లో అనుకుంటా. చిన్న పిల్లల పత్రిక చందమామ లు తెప్పించే ఏర్పాటు మొదలు పెట్టాము. కొంత మంది తమ పిల్లలకు తమ చిన్ననాటి పత్రిక ను పరిచయం చేద్దామనీ, మరి కొంత మంది తమ చిన్ననాటి ని వెతుక్కుంటూ - చందమామ లు తెప్పించుకుని మా ప్రయత్నాన్ని ప్రోత్సహించారు. దానితో మరి కొన్ని పత్రికలు అందులో చేర్చాము.

ఇప్పుడు మేము ఉంటున్నది maryland లో. 2005 జనవరి 9 న ఆది వారాలు పొద్దున పూట పిల్లలకు తెలుపు నేర్పటం మొదలు పెట్టాము. పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారు. వాళ్ళ పద్యాలు వింటే మీకే తెలుస్తుంది.

ఇవీ ఇప్పటిదాకా సంగతులు.

పరిగి మదన్ మోహన్
Woodstock, MD 21163
443-364-4876

ఇంటికి పోదామా